లోకల్ సూపర్ మాన్ గా సాయి కిరణ్!
on Aug 16, 2022
గుప్పెడంత మనసు సీరియల్ ఇప్పుడు బుల్లి తెర మీద ఎంత పెద్ద హిట్టో చెప్పక్కర్లేదు. ఈ సీరియల్ లో జగతి, మహేంద్ర, రిషి సర్, వసుధారా, సాక్షి మెయిన్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఈ సీరియల్ మంచి రసపట్టులో ఉంది. రిషి సర్ వసుధారతో ఎంగేజ్మెంట్ చేసుకుంటాడా లేదా సాక్షితోనా అనేది ఫుల్ సస్పెన్స్. సీరియల్ విషయం పక్కన పెడితే ఈ టీం అందరూ కూడా సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా ఉంటారు. షూటింగ్ ఫొటోస్, మేకప్ క్లిప్స్, ఎపిసోడ్ క్లిప్స్, ఖాళీ టైములో చేసే డాన్సులు , టిక్ టాక్ లు, రీల్స్ ఫుల్ వైరల్ అవుతూ ఉంటాయి.
సింగర్ సాయికిరణ్ సీరియల్లో మహేంద్ర అనే రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక సాయి కిరణ్ పెట్టే వీడియోస్ కి వేలల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. సాక్షి రోల్ లో రసజ్ఞ రీతూ అనే అమ్మాయి కీ రోల్ ప్లే చేస్తోంది. ఐతే ఇప్పుడు ఈ సాయికిరణ్, రసజ్ఞ కలిసి సరదాగా చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రసజ్ఞ కార్లో వెళ్తుంటే పక్కనుంచి సాయికిరణ్ గాల్లో సూపర్ మాన్ లా ఎగురుతూ వచ్చి కార్ డోర్ తట్టి "దండుపాళ్య కి ఎటు పోవాలే అంటే అటు అని చెప్తుంది రసజ్ఞ..కల్లు దొరుకతద అని అడుగుతాడు..ఆ దొరుకుతది అని చెప్తుంది ..ఐతే ఓకే " అని వెళ్ళిపోతాడు. ఇక ఈ వీడియో బాక్గ్రౌండ్ సూపర్ మాన్ మ్యూజిక్ పెట్టి "ఇఫ్ సూపర్ మాన్ ఈజ్ పక్క లోకల్" అని కాప్షన్ పెట్టి ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది రసజ్ఞ. ఈ వీడియో సూపర్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read